పిల్లలకు అవ్వ, తాత ప్రేమలపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పెద్దల మధ్య వివాదంతో పిల్లలను వారితో కలవకుండా చేయడం సరికాదని పేర్కొంది. నల్గొండ జిల్లాలో అల్లుడి వద్ద ఉన్న మనవరాలిని చూడటానికి కింది కోర్టు నిరాకరించటంతో అమ్మమ్మ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్ కన్నెగంటి లలిత విచారణ చేపట్టారు. మనవారాలిని పిలిపించి మాట్లాడిన తర్వాత చిన్నారి భావోద్వేగాల ఆధారంగా తీర్పు ఇచ్చారు. ఇద్దరి మధ్య విభేదాలతో మనవరాలికి అమ్మమ్మ అప్యాయత దూరం చేయరాదన్నారు.