బాపట్ల జిల్లాలో విషాదం జరిగింది. కొరిశిపాడు మండలం దైవాలరావూరులో ఇద్దరు చిన్నారులు విద్యుత్ తీగలపై పడ్డారు. ఒకరు అక్కడిక్కడే మృతిచెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. బాదం చెట్టు ఎక్కి ప్రమాదవశాత్తు తీగలపై పడ్డారు. విద్యుదాఘాతానికి గురి కావటంతో ఓ బాలుడిని హుటాహుటినా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.