చైనా వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు మళ్లీ భారీగా విస్తరిస్తున్నాయి. చైనాలో మొత్తం 17 మిలియన్ల మంది నివాసితులను ప్రభుత్వం ఆదివారం లాక్డౌన్లో ఉంచింది. లాక్డౌన్, ప్రజా రవాణా నిబంధనలు మార్చి 20 వరకు అమల్లో ఉంటాయని ప్రకటించారు. మరోవైపు పొరుగున ఉన్న హాంకాంగ్, షెన్జెన్ పరిధిలోని నివాసితులందరినీ ఇంట్లోనే ఉండమని చెప్పింది. ఈ క్రమంలో 18 ప్రావిన్సులు ఓమిక్రాన్, డెల్టా వేరియంట్ల సమూహాలతో పోరాడుతున్నాయని అక్కడి అధికారులు తెలిపారు. దాదాపు 30 మిలియన్ల మంది లాక్డౌన్లో ఉన్నట్లు వెల్లడించారు.