భారత్ కు చెందిన ఓ క్షిపణి పాకిస్థాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన భారత్ ప్రమాదవశాత్తు క్షిపణి పాకిస్థాన్‌లోకి చొచ్చుకెళ్లిందని తెలిపింది. దీనిపై సంయుక్త విచారణ జరపాలని పాక్ విదేశాంగ శాఖ డిమాండ్ చేస్తుంది. అయితే ఈ ఘటనపై చైనా స్పందించింది. ఈ ఘటనను మరింత పెద్దది కానివ్వకుండా, ఇరు దేశాలు సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించింది. దక్షిణాసియాలో ప్రధాన దేశాలైన పాక్, భారత్‌ల మధ్య శాంతి, భద్రతలు ఉండాలని, దానిని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని చైనా విదేశాంగ మంత్రి సూచించారు. మున్ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా ఇరు దేశాలు నోటీసులు పంపుకునే యంత్రంగాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నారు.