హాంకాంగ్ తదుపరి పాలకుడిగా మాజీ సెక్యూరిటీ చీఫ్ జాన్ లీ ఎన్నికయ్యారు. చైనాకు అత్యంత నమ్మకస్తుడిగా పేరున్న ఇతడు ఈ ఎన్నికల్లో గెలుపొందాడు. రహస్య బ్యాలెట్ పోలింగ్‌లో 1500 మంది సభ్యుల్లో 1416 ఓట్లతో బీజింగ్ అనుకూల కమిటీ ఆయనను ఎన్నుకుంది. చైనాకు అనుకూలంగా ఉన్న ఇతడు హాంకాంగ్ ప్రజాస్వామ్య అనుకూల ఉద్యమాలను అణచివేయడంలో దిట్టగా పేరొందాడు.