అంతరిక్షంలో స్పేస్ సెంటర్ను నిర్మించడానికి చైనా వేగంగా చర్యలు చేపడుతోంది. అందులో భాగంగానే ఆదివారం క్రూడ్ మిషన్ను ప్రారంభించనుంది. ఒక వ్యోమనౌకలో చైనాకు చెందిన ముగ్గురు వ్యోమగాములు అంతరిక్షానికి వెళ్లనున్నారు. అక్కడే ఆరు నెలలు ఉండి అంతరిక్ష కేంద్రానికి సంబంధించిన కీలక పనులను పూర్తి చేస్తారు. జియుక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుండి 10:44 గంటలకు (02.44 GMT) ఈ ప్రయోగాన్ని చేపట్టనున్నారు.