ఇప్పటికే తమ సొంత అంతరిక్ష పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్న చైనా మరో ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. అంతరిక్షంలో సోలార్ పవర్ ప్లాంట్‌ను నెలకొల్పనుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు ఇప్పటికే ప్రారంభమవగా.. 2028 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తయి అందుబాటులోకి వస్తుందట. నిజానికి ఈ సోలార్ పవర్ ప్లాంట్‌ను 2030 వరకు తీసుకురావాలని ప్లాన్ చేయగా.. అనుకున్న గడువుకు రెండు సంవత్సరాల ముందే దీనిని తీసుకురానున్నారు. కాగా ఈ పవర్ ప్లాంట్ నుంచి ఉత్పత్తి అయ్యే పవర్‌ను భూమికి సరాఫరా చెయ్యొచ్చట. దీనికి సంబంధించిన ట్రయల్స్ కూడా విజయవంతమయ్యాయి.