ప్రపంచంలోనే అత్యధికంగా జనాభా కలిగిన దేశం చైనా. అయితే ఇప్పుడు ఆ దేశంలో జనాభా క్రమంగా తగ్గుతోంది. గతంలో ప్రభుత్వం ఒకరినే కనాలని పెట్టిన ఆదేశం ఇప్పుడు వారికి శాపంగా మారింది. 2021లో వారి జనాభా 141.21 కోట్ల నుంచి 141.26కు చేరింది. అయితే 2029 నాటికి ఆ దేశ జనాభా 144 కోట్లకు చేరుతుందని, ఆ తరువాత జనాభా క్షీణించి 2100 నాటికి 58.7 కోట్లకు పడిపోతుందని ‘షాంఘై అకాడమీ ఆఫ్ సోషల్ సైన్సెస్’ తెలిపింది. కాగా ప్రస్తుతం చైనా ప్రభుత్వం పిల్లలను కనాలని ఆ దేశ ప్రజలకు సూచిస్తోంది. పిల్లలు కనే వారికి వివిధ పథకాలు అందజేస్తామని చెబుతోంది.