చైనాలో కరోనా కట్టడికి ప్రభుత్వం అమలు చేస్తున్న ‘జీరో కొవిడ్’ విధానంపై ఆ దేశ ప్రజలు నిరసనలతో భగ్గుమన్నారు. వేలమంది రోడ్లపైకి వచ్చి ఆందోళనలకు దిగారు. ‘జిన్ పింగ్ దిగిపో’ అంటూ ప్లకార్డులతో ఆంక్షల పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆందోళనల్లో ప్రముఖ మీడియా సంస్థ BBC జర్నలిస్టును అధికారులు అరెస్ట్ చేశారని, వారి తీరుపట్ల BBC అభ్యంతరం వ్యక్తం చేసింది. మరోవైపు ప్రపంచమంతా కరోనా తగ్గుముఖం పడుతుంటే చైనాలో మాత్రం కేసులు పెరుగుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే 40 వేల మంది వైరస్ బారిన పడ్డారు.