కోవిడ్ ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత చైనీయులు వరల్డ్టూర్లు వేయడంపై ఆసక్తి చూపుతున్నారు. మూడేళ్లుగా జీరో కోవిడ్ నిబంధనలతో స్వదేశంలోనే మగ్గిపోయారు. ఈ క్రమంలో కోవిడ్ ఆంక్షలు ఎత్తి వేయడంతో ప్రపంచ పర్యటనకు వెళ్లేందుకు అక్కడి ప్రజలు ఉత్సాహం గా ఉన్నారు. చైనీయులు జపాన్, హాంకాంగ్, మకావ్, సౌత్ కొరియా, థాయిల్యాండ్ దేశాలకు వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు. కోవిడ్‌కు ముందు 2019లో 16 కోట్ల మంది ప్రపంచ యాత్ర చేయగా 2020లో అది 2 కోట్లకు పడిపోయింది.