రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఇప్పటికే ముడి చమురు ధరలు, గ్యాస్, వంటనూనె ధరలు పెరగడంతో పాటు స్టాక్ మార్కెట్లు కూడా ఊగిసలాడుతున్నాయి. అయితే ఈ యుద్ధం కారణంగా చిప్‌ల కొరత ఏర్పడనుంది. ఇప్పటికే కరోనా కారణంగా చిప్‌ల ఉత్పత్తి తగ్గిపోయింది. చిప్‌ల తయారీలో అవసరమైన కంపోనెంట్స్‌ను అత్యధికంగా రష్యా, ఉక్రెయిన్ దేశాలే ఎగుమతి చేస్తూ ఉంటాయి. అయితే ఈ దేశాల మధ్య యుద్ధం కొనసాగుతుండడంతో చిప్‌ల కొరత మరింత తీవ్రం కానుంది. ఈ కొరత ప్రపంచ ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.
AP News
సొంత పార్టీ నేతలపై కోటం రెడ్డి తీవ్ర విమర్శలు