ఇటీవల స్పీచ్‌లో అల్లు అర్జున్ ‘మెగా’ పేరును గానీ, చిరంజీవి పేరును గానీ వాడకపోవడంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. “ప్రతిసారి నా గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అది జనాలకు వెగటు పుట్టిస్తుంది. పవన్ కల్యాణ్, చరణ్, బన్నీ వీరంతా నా చేయి పట్టుకుని బుడిబుడి అడుగులు వేశారు. ఇప్పుడు పరుగెడుతున్నారు. వారికి ఇంకా నా చేయి పట్టుకుని నడవాల్సిన అవసరం లేదు” అని అన్నారు.