‘మయోసైటిస్’ వ్యాధితో చికిత్స పొందుతున్న సమంతకు సినీ ప్రముఖులు బాసటగా నిలుస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. సమంత త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సమస్యను అతి త్వరగా అధిగమిస్తావని సమంతకు చిరు ధైర్యం చెప్పారు. ‘డియర్ సామ్.. కాలానుగుణంగా ఎదురయ్యే సవాళ్లను అధిగమించటంలోనే మన బలాబలాలు తెలుస్తాయి. నీ మనోబలం గొప్పది. అతి త్వరలో ఈ సమస్యను అధిగమిస్తావనే నమ్మకం నాకుంది. నీకు మరింత ఆత్మస్థైర్యాన్ని భగవంతుడు కలిగించాలి ’ అని అర్థం వచ్చేలా చిరు ట్వీట్ చేశారు.