మెగాస్టార్ చిరంజీవితో డైరెక్టర్ మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్న భోళా శంకర్ చిత్రానికి సంబంధించి ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. ఈ చిత్రం రెమ్యూనరేషన్‌ను చిరు తీసుకోవడం లేదని టాక్ వినిపిస్తోంది. రెమ్యూనరేషన్‌కు బదులు సినిమా ఓవరాల్ బిజినెస్‌తో పాటు, థియేట్రికల్ రన్ షేర్‌లో వాటా తీసుకుందామని చిరు భావిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకు రూ.45 కోట్ల రెమ్యూనరేషన్‌ను చిరు తీసుకోవాల్సి ఉండగా దానిని పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.