మెగాస్టార్ చిరంజీవి అటు ఫ్యామిలీతో గడుపుతూనే.. ఇటు సినిమాలో బిజీ బిజీగా గడుపుతున్నారు. తాజాగా చిరు చేసిన ఓ పోస్టు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ‘ఫ్యామిలీతో అటు విహారయాత్ర.. హీరోయిన్‌తో ఇటు వీరయ్య యాత్ర’ అంటూ ఫ్యామిలీ, హీరోయిన్ శ్రుతి హాసన్‌తో కలిసి ఉన్న ఫొటోలను పంచుకున్నారు. దీంతో ఈ ట్వీట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. అయితే, దీనిపై ట్విటర్లో భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కాగా, చిరు, శ్రుతిహాసన్ నటించిన ‘వాల్తేరు వీరయ్య’ జనవరి 13న విడుదల కానుంది. బాబీ దర్శకత్వం వహించగా.. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.