చిరంజీవి పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో ఓ మూవీ తెరకెక్కనుంది. చిరు రీఎంట్రీ సినిమాగా ప్లాన్ చేసిన ‘ఆటోజానీ’ స్టోరీని మించి కొత్త కథ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని డైరెక్టర్ పూరీ జగన్నాథ్ వెల్లడించాడు. గాడ్‌ఫాదర్ సక్సెస్ అనంతరం చిరంజీవిని పూరీ జగన్నాథ్ ఇంటర్వ్యూ చేశారు. చర్చా సమయంలో ‘ఆటోజానీ’ని ఏం చేశావ్ అని పూరీని చిరు అడిగారు. ‘అది పాత కథ. ఇప్పుడు అంతకంటే మంచి కథను మీకోసం రెడీ చేస్తా. త్వరలో మిమ్మల్ని కలిసి వినిపిస్తా’ అని పూరీ బదులిచ్చాడు. మరి ఈ సినిమా పట్టాలెక్కుతుందో లేదో చూడాలి.
చిరుతో పూరీ జగన్నాథ్ సినిమా..?

Screengrab Twitter:@Gowtham__JSP