టీడీపీ నేత చింతకాయల విజయ్‌కి ఏపీ సీఐడీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందజేసేందుకు HYDలోని బంజారాహిల్స్‌లో ఉన్న విజయ్ నివాసానికి పోలీసులు చేరుకు న్నారు. అయితే, విజయ్ ఇంట్లో లేకపోవడంతో అక్కడున్న వారికి నోటీసులు ఇచ్చారు. విచారణకు ఈనెల 6న హాజరుకావా లంటూ అందులో పేర్కొన్నారు. 41 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు. కాగా, మార్ఫింగ్ వీడియో వ్యవహారంపై హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్.. విజయ్‌పై ఏపీ సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.