రూ.8 కోట్ల విలువైన సిగరెట్లు సీజ్

yousay

విజయవాడలో భారీగా విదేశీ సిగరెట్లను పోలీసులు పట్టుకున్నారు. దాదాపు రూ.8కోట్ల విలువైన విదేశీ బ్రాండ్లకు చెందిన సిగరెట్లను పోలీసులు సీజ్ చేశారు. నగరంలో విక్రయించేందుకు ఓ వ్యాపారి కంటైనర్‌లో తరలిస్తుండగా పట్టుకున్నారు. వ్యాపారిని అరెస్ట్ చేసిన పోలీసులు విచారిస్తున్నారు. ఇంత పెద్దమొత్తంలో సిగరెట్లను పట్టుకోవడం ఇదే తొలిసారి అని అధికారులు తెలిపారు. భారీగా సిగరెట్లు నగరంలోకి ఎలా ప్రవేశించాయనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Exit mobile version