భారత్‌కు రజత పతకం తీసుకొచ్చిన నటుడు మాధవన్ కొడుకు వేదాంత్..

Screengrab Instagram:

నేటి కాలంలో సినీ సెలబ్రెటీల కొడుకులు సినీ ఇండస్ట్రీలోనే మకాం వేస్తున్నారు. కానీ తమిళ నటుడు మాధవన్ కొడుకు మాత్రం అద్భుత ప్రతిభతో మువ్వన్నెల జెండాను విదేశీ గడ్డ మీద రెపరెపలాడించాడు. డెన్మార్క్‌లో జరిగిన డానిష్ స్విమ్మింగ్ ఓపెన్‌లో రజత పతకం సాధించి సత్తా చాటాడు. నటుడు మాధవన్ సోషల్ మీడియాలో ఈ విషయాన్ని షేర్ చేసి పుత్రోత్సాహంతో మురిసిపోయాడు. 1500 మీటర్ల ఫ్రీ స్టైల్ విభాగంలో వేదాంత్ ఈ ఘనత సాధించాడు.

Exit mobile version