ఏపీ రాజధాని అమరావతి విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజధానికి సంబంధించిన పిటిషన్లను తాను విచారణ చేయనని CJI యూయూ లలిత్ తప్పుకున్నారు. ఈ పిటిషన్లను తాను లేని వేరే బెంచ్‌కు బదిలీ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు. రాజధాని ప్రాంత రైతులు, ఏపీ ప్రభుత్వం వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్ల విచారణకు యూయూ లలిత్ విముఖత చూపారు.
‘అమరావతి’ విచారణ నుంచి తప్పుకున్న CJI

© ANI Photo