పుష్ప-2 షూటింగ్‌పై క్లారిటీ

అల్లు అర్జున్, రష్మిక మందాన జంటగా సుకుమార్ తెరకెక్కించిన ‘పుష్ప’ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో.. ఈ మూవీ సీక్వెల్ ‘పుష్ప-2’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ప్రస్తుతం స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. వర్షాలు కూడా తగ్గుముఖం పట్టడంతో సెప్టెంబర్ మొదటి వారం నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అంతా అనుకున్నట్టు జరిగితే 2023లో ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట.

Exit mobile version