రష్యా దాడులు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మరోసారి కీలక ప్రకటన చేశారు. నాటోలో తాము అస్సలు చేరమని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని యావత్ జాతిజనులు గమనించాలని కోరారు. రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమై 20 రోజులు గడుస్తుంది. పలు దఫాలుగా శాంతి చర్చలు జరిపినప్పటికీ డిమాండ్లు కొలిక్కిరాకపోవడంతో యుద్ధం కొనసాగుతూనే ఉంది.