రూటు మార్చిన సీఎం అభ్యర్థులు

© File Photo

తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో పోటీపై నేతలు కసరత్తులు చేస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో పోటీపై సీఎం అభ్యర్థులు ఏఏ స్థానాల నుంచి పోటీ చేయాలనే దానిపై కసరత్తులు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ గజ్వేల్‌ను వదిలి సిద్ధిపేట, ఆలేరు నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుండగా.. ఈటెల గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని స్వయంగా ప్రకటించారు. అటు రేవంత్ రెడ్డి ఎల్బీ నగర్ నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తుండగా.. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ వేములవాడ నుంచి పోటీ చేస్తారని సమాచారం. అయితే నాయకులు తమ సిట్టింగ్ స్థానాలను వదిలేసి వేరే స్థానాల నుంచి పోటీ చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Exit mobile version