తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సీఎం జగన్ పర్యటించనున్నారు. పింఛన్లు రూ. 2750కి పెంచిన కారణంగా వారోత్సవాల్లో పాల్గొంటారు. లబ్ధిదారులతో ముఖాముఖిగా మాట్లాడనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి గూడెం నుంచి బయలుదేరి 11 గంటలకు రాజమహేంద్రవరం చేరుకుంటాారు. పింఛన్ లబ్ధిదారులతో కాసేపు ముచ్చటించిన తర్వాత బహిరంగ సభ జరుగుతుంది. అందులో పాల్గొన్న అనంతరం తిరుగు పయనం అవుతారట. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పింఛన్ పెంచాారు.