AP: గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నియామక ప్రక్రియ ఎలాంటి అవినీతి లేకుండా పారదర్శకంగా జరగాలని అధికారులకు సీఎం సూచించారు. ప్రభుత్వంలోని ఆయా శాఖల నుంచి ఖాళీల వివరాలు సేకరిస్తున్నట్లు అధికారులు జగన్కు వివరించారు. ఖాళీలపై స్పష్టత వచ్చాక, ఆర్థిక శాఖకు పంపిస్తామని పేర్కొన్నారు. మరోవైపు గ్రామ సచివాలయాలకు వైర్లెస్ ఇంటర్నెట్కు బదులు కెబుల్ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని సీఎం అధికారులకు సూచించారు.