TS: 4వేల మెగావాట్ల సామర్థ్యంతో రూపొందుతున్న యాదాద్రి మెగా థర్మల్ ప్లాంటును సీఎం కేసీఆర్ పరిశీలించారు. దేశానికే తలమానికంగా ఈ ప్లాంటు నిలుస్తుందని కొనియాడారు. ఈ మేరకు అక్కడ జరుగుతున్న పనులను మంత్రులతో కలిసి పరిశీలించారు. 30రోజుల పాటు విద్యుదుత్పత్తి చేసేందుకు అవసరమైన బొగ్గు నిల్వలు ఉండేలా ప్లాంటులో ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఉద్యోగుల క్వార్టర్స్ కోసం 100 ఎకరాలు కేటాయించాలన్నారు. ప్లాంటు నిర్మాణానికి భూమిలిచ్చి సహకరించిన రైతుల పెండింగు సమస్యలను పరిష్కరించాలన్నారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం సమీపంలో పూర్తిగా ప్రభుత్వ నిధులతోనే ఈ ప్లాంటు నిర్మితమవుతోంది.
యాదాద్రి ప్లాంటును పరిశీలించిన సీఎం

Courtesy Twitter:TelanganaCMO