సీఎం జగన్ ప్రధాని మోదీని కలిశారు. ఏపీకి సంబంధించిన పలు అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చించారు. రాష్ట్ర విభజన, పోలవరం, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రత్యేక హోదా, కడప స్టీల్ ప్లాంట్ తో పాటు పలు అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. అన్ని అంశాలను కూలంకశంగా తెలియజేస్తూ వినతిపత్రం సమర్పించారు. 2014–15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిసోర్స్ గ్యాప్ ఫండింగ్ రూ.36,625 కోట్లు విడుదల చేయాలి ప్రధానిని కోరారు.