ఏపీకి మూడేళ్లలో రూ.39,359 కోట్ల పెట్టుబడులు: సీఎం జగన్

screen shot

ఏపీ వేగంగా అభివృద్ధి చెందుతుందని సీఎం జగన్ పేర్కొన్నారు. అనకాపల్లిలోని అచ్యుతాపురం సెజ్ లో ఏటీసీ టైర్ల పరిశ్రమను ప్రారంభించిన సందర్భంగా జగన్ తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ గత మూడేళ్లుగా అగ్రస్థానంలో ఉన్నట్లు గుర్తు చేశారు. 2021-22లో ఏపీలో 11.43 శాతం వృద్ధిరేటు నమోదైనట్లు వెల్లడించారు. ఏపీకి 3 ఏళ్లలో 17 భారీ సంస్థల ద్వారా రూ.39,359 కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. వచ్చే రెండేళ్లలో మరో 56 కంపెనీలు వస్తున్నట్లు వివరించారు. గతంలో ఎప్పుడు రాష్ట్రం వైపు చూడని సంస్థలు ఇప్పుడు ఏపీలో పెట్టుబడులు పెడుతున్నాయని సీఎం జగన్ అన్నారు.

Exit mobile version