ఏపీ సీఎం వైఎస్ జగన్ నేడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని నరసన్నపేటలో వైఎస్సార్ జగనన్న భూహక్కు, భూరక్ష పత్రాలను పంపిణీ చేయనున్నారు. జగన్ ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరుతారు. ఉదయం 11 గంటలకు నరసన్నపేట జూనియర్ కళాశాల గ్రౌండ్లో దిగుతారు. 12..55 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1.25 గంటలకు అక్కడ బయలుదేరి 3.25 గంటలకు తాడేపల్లికి చేరుకుంటారు.
నేడు శ్రీకాకుళం పర్యటనకు సీఎం జగన్

Courtesy Twitter: ap cmo