ప్రజలు, ప్రతిపక్షాల నుంచి వస్తున్న వ్యతిరేకతతో వరంగల్‌లో ల్యాండి పూలింగ్‌ను సీఎం కేసీఆర్ నిలిపివేశారు. వరంగలో ఓఆర్ఆర్ కోసం 27 గ్రామాల్లో స్థలాలు సేకరించేందకు ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే రైతులు తీవ్రంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వం రియల్ ఎస్టేట్ మాఫియా చేస్తుందంటూ దుమ్మెత్తిపోస్తున్నాయి. రెండేళ్లలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ సమయంలో వ్యతిరేకత వస్తే పార్టీపై ప్రతికూల ప్రభావం ఉంటుందని భావించిన కేసీఆర్ స్థల సేకరణను నిలిపివేయాలని అధికారులను ఆదేశించారు.