తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఏఐజీ ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ” ఎండోస్కోపి, సిటీ స్కాన్ పరీక్షలు నిర్వహించాం. ఆయనకు అల్సర్ ఉందని గుర్తించాం. కడుపునొప్పితో ఆయన ఆస్పత్రికి వచ్చారు. ఇందుకు సంబంధించి చికిత్సను ప్రారంభించాం. అవసరమైన మందులు అందించాము” అని వైద్యులు వెల్లడించారు. ఏఐజీ ఛైర్మన్ నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించారు.