తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్ర మంత్రులతో తన ఫామ్ హౌజ్‌లో సమావేశం నిర్వహించారు. ఈ ఉదయం కేసీఆర్ ఫామ్ హౌజ్ నుంచి మంత్రులతో పాటు సీఎస్‌కు ఫోన్ వెళ్లడంతో వాళ్ళు హుటాహుటిన ఫామ్ హౌజ్‌కు చేరుకున్నారు. ఓ పక్క ఉద్యోగాల నోటిఫికేషన్, మరో పక్క అయిదు రాష్ట్రాల ఎన్నికలు ముగియడంతో కేసీఆర్ రాజకీయ పరంగా ఈ సమావేశం నిర్వహించారా లేదా వేరే కారణాల వల్ల నిర్వహించారా అనేది ఆసక్తికరంగా మారింది. మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనలో ఉండగా.. పలువురు మంత్రులు వేరే ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో నసమావేశం నిర్వహించడం చర్చనీయాంశమైంది.