సీఎం కేసీఆర్ భయపడుతున్నారు: బండి

© ANI Photo

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్.. సీఎం కేసీఆర్‌పై మండిపడ్డారు. ప్రస్తుతం గృహ నిర్బంధంలో ఉన్న ఆయన కేసీఆర్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం విషయాలు బయటపడుతాయని సీఎం భయపడుతున్నారని విమర్శించారు. లిక్కర్ కుంభకోణంలో తన ప్రమేయం లేకుంటే ఎమ్మెల్సీ కవిత నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా లిక్కర్ స్కాం గురించి మాట్లాడుతుంటే కేేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. వాటిని పక్కదారి పట్టించేందుకు తన పాదయాత్రను అడ్డుకున్నారని ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పాదయాత్ర కొనసాగిస్తానని స్పష్టం చేశారు. ఈనెల 27 ముగిస్తానని పేర్కొన్నారు.

Exit mobile version