తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపుపై సీఎం కేసీఆర్ విముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. కరెంటు ఛార్జీల పెంపుదలకు ఆమోదం తెలపడానికి కేసీఆర్ తడబడుతున్నట్లు సమాచారం. మరోవైపు ఏప్రిల్ 1 నుంచి విద్యుత్ ఛార్జీల పెంపు తప్పనిసరి అని డిస్కామ్ తెలంగాణ రాష్ట్ర రెగ్యులేటరీ కమిషన్‌కు నివేదించింది. కాని పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) గెల్చిన తర్వాత ఉచితంగా విద్యుత్, విద్య, వైద్యం,నీరు అందిస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కూడా సీఎం ఆ దిశగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.