తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు అసెంబ్లీలో కీలకప్రకటన చేయనున్నారు. ఈ రోజు జీరో అవర్, క్వశ్చన్ అవర్ ఉంటుందని ప్రకటించినా కానీ దానిని రద్దు చేశారు. టీఆర్ఎస్ నుంచి ఆర్థిక మంత్రితో పాటు, ఎమ్మెల్యే బాల్క సుమన్, మరో ఇద్దరు, కాంగ్రెస్ నుంచి ఒకరు, ఎంఐఎం నుంచి ఒకరు బడ్జెట్ గురించి మాట్లాడనున్నారు. సీఎం లేదా ఆర్థిక మంత్రి బడ్జెట్‌పై జరిగిన చర్చకు సమాధానమిస్తారు. అసలు కేసీఆర్ ఏం ప్రకటిస్తారా? అని రాష్ట్రం మొత్తం ఆతృతగా ఎదురు చూస్తోంది.