పంజాబ్ తరహాలో రైతు ఉద్యమం చేస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. అందుకోసం నేతలు సిద్ధం కావాలని సూచించారు.కేంద్రం వరికే కాకుండా ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్రమే మొత్తం ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. కశ్మీర్ ఫైల్స్ పక్కన పెట్టి ప్రధాని మోదీ ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని కేసీఆర్ అన్నారు. భవిష్యత్ రాజకీయాలపై హైదరాబాద్ తెలంగాణ భవన్ లో తెరాస అధినేత, సీఎం కేసీఆర్ సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఎమ్మెల్యేలు, మంత్రులు, జడ్పీ ఛైర్మెన్లు సహా పలువురు నేతలు హాజరయ్యారు. ఇవాళ సాయంత్రం సీఎం, మంత్రులు దిల్లీ వెళ్లనున్నారు.