హైదరాబాద్ పాతబస్తీలో ఎలాంటి ఆధారాలు లేకుండా జారీ చేసిన జనన, మరణ ధ్రువీకరణ పత్రాలపై సమగ్ర దర్యాప్తు చేయించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. 27 వేల జనన, 4వేల మరణ ధ్రువీకరణ పత్రాలతో పాటు రేషన్, ఓటర్ కార్డులపై నిజా నిజాలు వెలికి తీయాలని పట్టుబట్టారు. కేసీఆర్ వైఫల్యానికి, GHMCలో పేరుకుపోయిన అవినీతి ఉదంతానికి ఇది నిదర్శనమని మండిపడ్డారు. ఇందుకు నైతిక బాధ్యత వహించి కేసీఆర్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని కోరారు.