విపక్షాలు తమ రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాను నియమించాయి. ఈయనకు మద్దతు ఇవ్వమని.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ఫోన్ చేసి అభ్యర్థించారు. ఇందుకు కేసీఆర్ సానుకూలంగా స్పందించినట్లు శరద్ పవార్ తెలిపారు. రెండు మూడు రోజుల్లో ఇందుకు సంబంధించిన అధికారిక నిర్ణయాన్ని కేసీఆర్ వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. అధికారిక నిర్ణయం వెలువరించే ముందు ఆయన పార్టీ నేతలతో చర్చించనున్నారు.