భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆ జిల్లాపై వరాల జల్లు కురిపించారు. జిల్లాలోని ప్రతి గ్రామానికి రూ.10 లక్షల చొప్పున ప్రత్యేక నిధులు ప్రకటించారు. అలాగే కొత్తగూడెం, పాల్వంచకు రూ.25 కోట్ల చొప్పున మంజూరు చేశారు. ఇల్లందు, మణుగూరు మున్సిపాలిటీలకు తలా రూ.40 కోట్లు ప్రకటించారు. ఈ నిధులతో అభివృద్ధి పనులు చేసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. మైనింగ్ ఇన్స్టిట్యూషన్ను మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు.