నేడు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సీఎంలు కేసీఆర్, కేరళ సీఎం పినరయి విజయన్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ దర్శించుకోనున్నారు. ఈమేరకు బీఆర్ఎస్ నేతలు భారీగా ఏర్పాట్లు చేశారు. సీఎంల పర్యటన నేపథ్యంలో యాదాద్రిలో భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు. ప్రెసిడెన్షియల్ సూట్స్, హెలిప్యాడ్ స్థలంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అటు భక్తుల దర్శనంపై ఆంక్షలు విధించారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు దైవ దర్శనాన్ని నిలిపివేశారు.