కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ కుమార్తె వివాహం రోజున సీఎం కేసీఆర్ అతడికి కానుక ఇచ్చారు. సివిల్ సప్లై కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమించారు. పెళ్లికి హాజరైన కొద్ది వ్యవధిలోనే ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో కుమార్తె పెళ్లి సందర్భంగా తండ్రికి కానుక వచ్చిందంటూ చర్చ జరుగుతోంది. కొద్దికాలంగా మంత్రి గంగుల, రవీందర్ సింగ్ మధ్య విబేధాలు ఉన్నాయని ప్రచారం జరిగింది. అదేశాఖకు గంగుల మంత్రిగా ఉండటంతో ఇద్దరు కలిసి పనిచేయాలని చేసినట్లు తెలుస్తోంది.