AP: మహిళా, శిశు సంక్షేమ శాఖపై సీఎం జగన్ మరోసారి సమీక్షా సమావేశం నిర్వహించారు. అంగన్వాడీల్లో చేపట్టిన నాడు-నేడు కార్యక్రమంపై ఆరా తీశారు. చిన్నారులకు పోషకాహారం అందించడంలో ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని ఈ మేరకు అధికారులను ఆదేశించారు. ఆహార సరఫరాలో జాప్యం ఉండకూడదని సూచించారు. ఈ మంత్రిత్వ శాఖకు ప్రభుత్వం రూ.1500 కోట్లకు పైగా ఖర్చుపెడుతోందన్నారు. అంగన్వాడీ పిల్లలకు ఫ్లేవర్డ్ మిల్క్‌ని తప్పనిసరిగా పంపిణీ చేయాలని సూచించారు. ఖాళీగా ఉన్న 63 సీడీపీఓ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వీటిని త్వరగా భర్తీ చేయాలని సీఎం ఆదేశించారు.