దేశ వ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్ని అంటాయి. ఉదయం నుంచే దేశ ప్రజలతో పాటు పలువురు ప్రముఖులు హోలీ పండగ వేడుకల్లో పాల్గొన్నారు. హోలీ సందర్భంగా పలువురు ముఖ్యమంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. అందులో భాగంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్‌లో జరిగిన హోలీకా దహన్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎప్పుడూ సత్యమే గెలుస్తుంది అని ఎన్నికలను చూపిస్తూ వ్యాఖ్యానించారు. అటు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తన ఇంటి వద్ద జరిగిన సంబరాల్లో పాల్గొనగా.. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ తన సతీమణితో కలిసి హోలీ సంబరాల్లో పాల్గొని హోలీ శుభాకాంక్షలు తెలిపారు. అటు ఏపీ సీఎం జగన్ కూడా హోలీ విషెష్ తెలియజేశారు.