తెలుగు రాష్ట్రాలపై చలి పంజా విసురుతోంది. ప్రజలు ఉదయం పూట బయటకి రావాలంటే వణకిపోతున్నారు. ఉ.9 గంటలు దాటనా పొగమంచు కప్పుకునే ఉంటోంది. పొగమంచు వల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. అటు కొమురంభీం జిల్లాలో 4.7, మంచిర్యాల జిల్లాలో 7.4, ఆదిలాబాద్ జిల్లాలో 7.6, నిర్మల్ జిల్లాలో 8.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైప ఏపీలోని అల్లూరి జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. ఏజెన్సీ ఏరియాలో పొగమంచు దట్టంగా కురుస్తోంది. మినుములూరులో 8, పాడేరులో 9 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. అరకులోయలో 8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.