దేశ రాజధాని ఢిల్లీని ఓ వైపు పొగమంచు, మరోవైపు చలి వణికిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోవడంతో పాఠశాలలకు సెలవులు ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. సోమవారం అత్యల్పంగా అయానగర్‌లో 3.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కాగా పొగమంచు వల్ల దాదాపు 150 విమానాలు ఆలస్యమయ్యాయి. ఉదయం నుంచే పొగమంచు దట్టంగా ఉండడంతో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు 29 రైళ్లు కూడా ఆలస్యంగా బయలుదేరాయి.