తెలుగు రాష్ట్రాల్లో తెల్లవారుజామున బయటకు రావాలంటే గజ గజ వణికే పరిస్థితి కనిపిస్తోంది. అనేక ప్రాంతాల్లో 10 డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలో కుమ్రం భీం జిల్లా సిర్పూర్‌లో 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లో పటాన్‌చెరులో 13.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఏపీలో ఏజెన్సీ ప్రాంతాల్లో మంచుదుప్పటి కమ్మేసింది. అల్లూరి జిల్లాలో కనిష్ఠంగా 7 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో రెండు రోజులు ప్రజలు చలితో అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ సూచిస్తోంది.