దేశవ్యాప్తంగా భారాసను విస్తరించే పనిలో పడ్డ సీఎం కేసీఆర్‌కు రాష్ట్రంలో చిక్కులు మెుదలయ్యాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరికివారే ఉంటున్నట్లు సమాచారం. మేడ్చల్ జిల్లా మల్లారెడ్డి తీరుకు వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ , ఖమ్మం, మహబూబ్‌నగర్‌లోనూ విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని సీఎం భావించినా అడుగులు పడటం లేదు. వంద మందికి ఒక ఇన్ఛార్జ్ అని చెప్పినా ఎవరూ కనిపించడం లేదు.