ఉత్తరాదిని చలి గజగజలాడిస్తున్న వేళ వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. మరో రెండ్రోజులు పరిస్థితులు ఇలాగే కొనసాగుతాయని వెల్లడించింది. పంజాబ్, హర్యానా, చంఢీఘర్, దిల్లీ, ఉత్తరప్రదేశ్ , బిహార్లో మరో 48 గంటలు మంచు కురుస్తుందని అధికారులు తెలిపారు. ఈ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. దాదాపు 2-4 డిగ్రీలకు ఉష్టోగ్రతలు పడిపోతాయని తెలుస్తోంది. దీంతో దేశ రాజధాని దిల్లీలో జనవరి 15 వరకు పాఠశాలలు మూసివేస్తున్నట్లు ప్రకటించారు.