ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో పలు దేశాలు ఇప్పటికే రష్యాపై తీవ్ర ఆంక్షలు విధించాయి. అయితే ఈ ఆంక్షలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS) క్రాష్‌కు దారితీయవచ్చని రష్యా అంతరిక్ష సంస్థ అధిపతి శనివారం హెచ్చరించారు. ఆంక్షలను ఎత్తివేయాలని తెలిపారు. ISSకి సేవలందిస్తున్న రష్యన్ అంతరిక్ష నౌక ఆపరేషన్‌కు అంతరాయం కలగవచ్చన్నారు. దీంతో 500 టన్నుల నిర్మాణం సముద్రంలో లేదా భూమిపైకి పడిపోయే అవకాశముందన్నారు. ఐఎస్ఎస్ కూలిపోయే అవకాశం ఉన్న ప్రదేశాల మ్యాప్‌ను ప్రచురిస్తూ, అది రష్యాలో ఉండే అవకాశం లేదని ఆయన సూచించారు.