భారత ఆర్మీకి చెందిన చీతా హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో ఇద్దరు పైలెట్లు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో పైలెట్ లెఫ్టినెంట్ కల్నల్ వీవీబీ రెడ్డి, కో పైలెట్ మేజర్ జయంత్‌లు మృత్యువాతపడ్డారు. కాగా ఈ రోజు ఉదయం అరుణాచల్‌ప్రదేశ్‌లోని వెస్ట్ కామెంగ్ జిల్లాలో హెలికాప్టర్ అదృశ్యమైంది. భారత సైన్యం హెలికాప్టర్ ఆచూకీ కోసం గాలించాయి. దిరాంగ్ ప్రాంతంలోని బంగ్లాజాప్ వద్ద హెలికాప్టర్ శకలాలు గుర్తించారు. అధికారులు అక్కడికి చేరుకునే సరికే పైలెట్, కోపైలెట్ మృతి చెందారు.